Saturday, February 28, 2009

నా జైలు జీవితం

ఇది నా ఇక్కడ, చెప్పేదే వేదం. ఇది నా కాలేజీ లైఫ్ గురించి. స్టూడెంట్ లైఫ్ ని ఎంజాయ్ చేద్దామని రెండు సంవత్సరాలు ఖైదీ iపోయిన వాడి వ్యథ. నా విషయానికొస్తే నేను ఉత్తముడు, తెలివైన వాడు, స్వతహాగా చమత్కారి ని (నేను ముందే చెప్పాను , నేను చెప్పిందే వేదం అని ). ఈ రెండు సంవత్సరాల జైలు జీవితం నాకొక బావ, మామ, తాత మరియు ఒక పెళ్ళాన్ని ఇచ్చింది. నాకు తెలుసు అన్నీ వదిలేసి మీరు పెళ్ళాం (నేను పదం గురించి చెబుతున్నాను ) మీద ఆసక్తి చూపుతున్నారు అని. నేను కాంపస్ లో అడుగెట్టగానే అప్సరస లాగ కనిపించింది. అంతే ఇక ఎం ఆలోచించకుండా మూడు ముళ్ళు వేసేసి , ఏడడుగులు నడిపించేసి ధర్మపతి ని ఐపోయా నా మనసులో. ఆ అమ్మాయి అసలు అందాని కి అందం, చదువు...ఇక మిగతావెందుకు? అందం చాలదూ ? కానీ కల్లనేవి నాకొక్కడికే ఇచ్చాడా ఆ దేవుడు ? మా కళాశాలలో ఉన్న ప్రతి ఒక్క గొట్టం గాడికి ఇచ్చాడు.


నేను మా ఆవిడ విపరీతంగా ప్రేమించుకుంటాం. నేను తనని, తను ఇంకొకర్ని. తను నాతో మాట్లాడటానికి ఎంతగా సిగ్గు పడుతుందంటే ! మొదటి సారి కలిసినపుడు పక్కనె నిలబడి హాయ్ చెప్పింది తర్వాత సిగ్గుతో ముసి ముసి నవ్వులు నవ్వుతూ బాయ్ చెప్పింది. ఆ "హాయ్" కి "బాయ్" కి మధ్య దూరం రెండు సంవత్సరాలు.


ఇక నాతో ఉన్న హితులు, సన్నిహితులు, ఇక్కడ చెప్పుకో దాగిన వారు నలుగురు. అందులో మొదటి వ్యక్తి మా బావ.
పోకిరి సినిమా రిలీజ్ అవ్వడానికి ముందీ నాకు, మహేష్ బాబు కి ఉన్న (ఒకే) ఒక్క అలవాటు అందర్నీ "అన్నయ్యా" అని పిలవటం. దీనివల్ల నాతో స్నేహం చేసినందుకు పాప ఫలితంగా అందరూ వాడిని "అన్నయ్య" అని పిలవడం మొదలెట్టారు. అమ్మాయిలతో సహా. తరువాత వాడి పోరు పడలేక కష్టపడి అన్నయ్య నుంచి వాడిని "బావ" ను చేశా. ఐనా ఎ మాటకామాట చెప్పుకోవాలి కాని, అన్నయ్య అని పిలిపించులోని పోగొట్టుకొన్నది లేదూ, బావా అని పిలిపించుకొని పెద్దగా పోదిచిన్డీ లేదు.

ఇప్పుడు మనం ఇంకో పాత్ర "బాబు"గురించి చెప్పుకొందాం. ఈయనకీ పేరు మన సిని రంగంలో ఈయన భంధువులు ఉన్నందువల్ల వచ్చింది. సత్బ్రహ్మనుడు , మంచి వాడు (మరి నాతో ఎందుకు చేరాడు!). ఇంకా చెప్పలన్తేయ్ శంకర భరణం సినిమా లో సోమయాజి గారి లాంటి వాడు. ఈయన తన స్వయంకృషి తో (చెప్పులు కుట్టి కాదు, బుక్కులు పట్టి) స్వర్ణ పథకాన్ని పొందాడు (నేనుకూడా (పరుల) స్వయంకృషి తో నా డిగ్రీ పొందాను). ఈయన గారు ఆర్ధిక శాస్త్రం లో అపర మేధావి, మా పంతులు గారికి ఏకలవ్యుడి లాంటి శిష్యుడు.

ఇక ముఖ్యంగా చెప్పుకోవలసిన వాళ్ళు ఇంకా ఇద్దరున్నారు. తెలుగింటి ఆడపడుచులు , కోపం రాని వరకూ మంచి వాళ్లు. నాకు ఎలాంటి సమస్య ఉన్నా వీరిద్దరూ నా పక్కన ఉండటానికి ఆరాట పడతారు. నిజం చెప్పాలంటే ఉబలాట పడతారునేను పడే కష్టాలు చూడటానికి. కానీ చాలా మంచివారు, నన్ను సరైన దారి లో పెట్టటానికి రెండేళ్ళు భగీరథ ప్రయత్నం చేసి ఆసలు వదిలేసారు.

ఈ వ్యాసం పాత్రల పరిచయం కే నిమిత్తం. ఇక అసలు కథ లో అడుగెట్టడం నాకు మూడ్ ని బట్టి నాకు కున్న సమయాన్ని బట్టి ఉంటుంది. అంత దాకా సెలవు.

నా జైలు జీవితంSocialTwist Tell-a-Friend